రొటీన్‌జాబ్‌తో విసిగిపోతున్నారా..? కొత్తగా ఏదైనా చేయాలని ఉందా..? మీకు కాస్త క్రియేటివిటీ ఉంటే బ్లాగింగ్ దునియాలో చేరిపోండి. ఇన్నాళ్లూ హాబీగా ఉన్న బ్లాగింగ్‌ను ఫుల్‌టైమ్ కెరీర్‌గా మలుచుకోండి. మంచి బ్లాగర్‌గా నిలబడగలిగితే.. రావాల్సినంత పేరుతో పాటు, కావాల్సినన్ని కాసులూ కురుస్తాయి, బ్లాగింగ్ దునియాలో సక్సెస్ కొట్టాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.
సోషల్ హబ్ విస్తరిస్తున్న వేళ.. కెరీర్‌గా బ్లాగింగ్‌కు బెటర్ ఫ్యూచర్ ఉందని చెబుతున్నారు నిపుణులు. కాస్త మనసుపెడితే బ్లాగర్స్‌గా వెబ్‌వరల్డ్‌లో మీ పేరు మార్మోగడం ఖాయమంటున్నారు. రొటీన్‌కు భిన్నంగా ఉండే బ్లాగింగ్‌ను కెరీర్ ఆప్షన్‌గా నిస్సందేహంగా ఎంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ రూపం సంతరించుకుంటున్న ఇండియాలో ఆన్‌లైన్ ఆధారిత కొలువు ఏది ఎంచుకున్నా కెరీర్ సాఫీగా సాగితుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడా కంపెనీల్లో ఉద్యోగాలు వదులుకొని మరీ బ్లాగర్స్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎందరో బ్లాగర్లు పేరుప్రఖ్యాతులతో పాటు అంచనాలకు మించిన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
లక్ష్యం తప్పనిసరి
హాబీగా ఉన్నంత కాలం ఎలా ఉన్నా.. ఫుల్‌టైమ్ బ్లాగర్స్‌గా మారిన తర్వాత మాత్రం కాస్త సీరియ్‌సగానే ఆలోచించాలి. ఆటవిడుపుగా కాకుండా ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలి. టెక్నాలజీ, పోయెట్రి, ట్రావెల్, కిచెన్ ఇలా రకరకాల సెక్టార్స్‌లో మీ బ్లాగింగ్ ప్రతిభను కనబరుచొచ్చు. అందరిలా కాకుండా మీ బ్లాగ్ కాస్త భిన్నంగా ఉండేలా చూసుకోవాలి. మీ టార్గెట్ ఎవరనే విషయంలో కూడా స్పష్టత ఉండాలి. కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తే మెరుగైన బ్లాగర్‌గా నిలబడవచ్చు.
ప్రత్యేకమైన శైలి
మనసులోని ఆలోచనలను అదేవిధంగా అక్షరబద్ధం చేయడం అంత సులభం కాదు. చెప్పదలచిన విషయం సూటిగా, స్పష్టంగా ఉండాలి. మీ వ్యక్తిగత స్వేచ్ఛకు బ్లాగ్ ఒక అడ్డాగా భావించకూడదు. అందులో ఏదైనా రాసేయొచ్చు అన్న భావన సరికాదు. నలుగురు మెచ్చే అంశాలను ప్రస్తావించినపుడే సక్సెస్ సాధ్యమవుతుంది. రాసే విధానం పక్కాగా ఉండాలి. సృజనాత్మకతకూ ప్రాధాన్యం ఇవ్వాలి.
ఒకే మాటపై
బ్లాగర్‌గా కాస్త డబ్బులు రావడం మొదలయ్యాక చాలామంది వింత పోకడలకు పోతుంటారు. కాస్త ఎక్కువ స్వేచ్ఛగా వ్యవహరిస్తుంటారు. అప్‌డేట్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలా చేయడం వల్ల అప్పటి వరకూ వచ్చిన మంచి పేరు కాస్తా చెడిపోతుంది. బాధ్యత కలిగిన వ్యక్తినని గుర్తుంచుకోవాలి. అదేసమయంలో మీ వాదనను సమర్థించుకునే నేర్పు కలిగి ఉండాలి. ఇందుకోసం అవసరమైతే అనుభవజ్ఞుల సహకారం తీసుకోండి.
ప్రచారం అవసరం
మీ బ్లాగ్‌లో ఎంత అద్భుతంగా రాసినా.. సరైన ప్రచారం కల్పించుకోలేకపోతే బ్లాగర్‌గా విఫలమైనట్టే. ప్రొఫెషనల్ బ్లాగ్‌లను, వెబ్‌సైట్స్‌తో మ్యూచువల్ అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలి. అప్పుడే మీ బ్లాగ్‌కు తగిన ప్రచారం లభిస్తుంది. బ్లాగర్‌గా పాపులారిటీ వచ్చిన తర్వాత కూడా ప్రమోట్ చేయడం ఆపొద్దు. ఈ టిప్స్ ఫాలో అయిపోతే బ్లాగింగ్ కెరీర్‌లో సక్సెస్ సాధించవచ్చు.

No comments:
Post a Comment